బయటపడిన నయీమ్ ఆస్తుల లెక్క

58

గ్యాంగ్ స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అందరి దృష్టి అతడి ఆస్తులపైనే పడింది. నయీమ్ ఎంత సంపాదించాడు అనే విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. ఇక ఈ క్రమంలోనే అసలు గ్యాంగ్ స్టర్ నయీమ్ ఇంట్లో ఎంత డబ్బు, బంగారం దొరికిందనే దానికి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుతో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఆర్టీఐ తెలిపిన వివరాల్లో నయీమ్ ఇంట్లో భారీగా నగదు బంగారం పట్టుబడిందని తెలిసింది. నగదు రూ.21657180, బంగారం1.944 కేజీలు, వెండి 2.482 కేజీలు, కార్లు 21, బైక్‌లు 26, సెల్ ఫోన్లు 60, లాండ్ డాక్యుమెంట్లు 752, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ 1, డైరీలు 130 లభించాయి.

ఇక పెద్ద మొత్తంలో ఆయుధ సామాగ్రి పట్టుబడినట్లు నివేదికలో వెల్లడైంది. 3 ఏకే 47 రైఫిల్స్, 9 పిస్టళ్లు, 3 రివాల్వర్లు, 7 తపంచాలు, ఎస్‌బీబీఎల్ 12 బోర్ గన్ 1, స్టెన్ గన్ 1, హ్యాండ్ గ్రెనేడ్స్ 2, జిలెటిన్ స్టిక్స్ 10, అమ్మోనియం నైట్రేట్ 5 కేజీలు, మేగజీన్స్ 6 రౌండ్లు, మొత్తం 616 రౌండ్ల బుల్లెట్స్, డిటొనేటర్లు 30 లభించాయి. ఇవన్నీ ఓ చిన్నపాటి యుద్ధం చేసేందుకు సరిపోయేలా ఉన్నాయి. ఇక ఇవన్నీ కోర్టుకు సమర్పిచామని, ప్రస్తుతం కేసు విచారణలో ఉన్నందున మిగతా వివరాలు వెల్లడించలేమని ఆర్టీఐ తెలిపింది. విచారణలో ఉన్న సమయంలో డైరీలోని విషయాలు పయటపెట్టేందుకు వీలుకాదని ఆర్టీఐ పేర్కొంది.

బయటపడిన నయీమ్ ఆస్తుల లెక్క