సఖి సెంటర్ లో నవ వధువు ఆత్మహత్య

73

గత కొద్దీ రోజులుగా ప్రేమికుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇంట్లో పెద్దలు ప్రేమ పెళ్లిని వ్యతిరేకిస్తుండటంతో యువతి, యువకులు బలవన్మరణానికి పాల్పడనున్నారు. గడిచిన రెండు నీళ్లలో 10కి పైగా ప్రేమ జంటలు, నవ దంపతులు మృతి చెందారు. ఇక తాజాగా మరో నవ వధువు మృతి చెందింది

వివరాల్లోకి వెళితే జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడు నూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన నర్సయ్య కూతురు శ్రీలేఖ (20) అదే గ్రామానికి చెందిన దేశబోయిన మనోహర్ (20) ప్రేమించుకున్నారు. డిసెంబర్ 16 న ఇద్దరు ఇంట్లోంచి హైదరాబాద్ పారిపోయారు. హైదరాబాద్ లో ఈ నెల 22 న వివాహం చేసుకున్నారు.

తిరిగి గ్రామానికి వచ్చి రక్షణ కల్పించామని జనగామ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు రెండు కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడారు. అయితే వారిని తీసుకెళ్లందుకు ఇరు కుటుంబాల వరకు ఒప్పుకోలేదు. దింతో యువతిని జనగామలోని సఖి కేంద్రానికి తరలించారు. అక్కడ మనోవేదనకు గురైన శ్రీలేఖ టాయిలెట్ డోర్ కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. శ్రీలేఖ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే వర్గానికి చెందిన వారు అయినప్పటికీ కుటుంబ సభ్యులు వీరి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిని రెండు కుటుంబాలు కలిసి అన్యాయంగా పొట్టనపెట్టుకున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.

సఖి సెంటర్ లో నవ వధువు ఆత్మహత్య