సర్వేలో మళ్ళీ మోడీకే పట్టం

133

మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు తీసుకోని ఆరేళ్ళు నిండినా ఆయన క్రీజ్ కొంచం కూడా తగ్గలేదు. ఏ సర్వే చూసిన ఆయనకు అనుకూలంగానే వస్తుంది. దేశంలో మోడీని వ్యతిరేకించే వారిసంఖ్య క్రమంగా తగ్గుతుంది. తిరిగి మోడీనే తమ నాయకుడు కావాలి అని కోరుకునేవారు సంఖ్య క్రమంగా పెరుగుతుంది. తాజగా అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖ నాయకులపై సర్వే చేసి ఆ రిపోర్ట్స్ విడుదల చేసింది. ఈ సర్వేలో అనేక విషయాలు వెలుగుచూశాయి.

ఈ సర్వేలో భారత ప్రధాని మోడీని 55 శాతం మంది ప్రజలు ఆమోదించారని ఆ సంస్థ తెలిపింది. ఇక జర్మనీ ఛాన్సలర్ కి 24 శాతం మంది ప్రజలు మద్దతు పలకగా, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ప్రజల నుంచి మద్దతు లభించలేదు. బోరిస్ ను బ్రిటన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రపంచ నాయకుల పనితీరు, పాలనా విధానం ఆధారంగా ఈ సర్వే జరిగింది. మోడీకి అనుకూలంగా 75 శాతం మంది, వ్యతిరేకంగా 20శాతం మంది ఓటెయ్యడంతో మోడీకి 55శాతం ఆమోద ముద్ర లభించిందని మార్నింగ్ కన్సల్ట్ తెలియజేసింది.

ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, యుకె, యుఎస్ మొత్తం 13 దేశాలకు చెందిన ప్రముఖ నేతలపై ఈ సర్వే జరిగింది. వీరిలో మోడీ టాప్ లో నిలిచారు. మోడీ విధానాలను, పరిపాలన దక్షతను ప్రజలు విశ్వసిస్తున్నారని సర్వేలో స్పష్టంగా అర్థమైంది.

సర్వేలో మళ్ళీ మోడీకే పట్టం