మోడీ కోడలికి కౌన్సిలర్ టికెట్ నిరాకరణ

151

గుజరాత్ లో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలోని 81 మునిసిపాలిటీలు, 31 డిస్ట్రిక్ట్ పంచాయత్స్, 231 తాలూకాలకు ఎన్నికల జరగనున్నాయి. ఫిబ్రవరి 21 న మొదటి విడత ఎన్నిక ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారం మొదలు పెట్టారు. మరోవైపు టికెట్ కోసం లాబీయింగ్ మొదలు పెట్టారు. ఇక అహ్మదాబాద్ మునిసిపాలిటీలో కౌన్సిలర్ గా పోటీ చేసేందుకు మోడీ సోదరుడి కోడలు టికెట్ కోరగా, పార్టీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. టికెట్ ఇవ్వడం కుదరదని తెలిపింది. ఈ విషయాన్నీ అహ్మదాబాద్ బీజేపీ ప్రెసిడెంట్ జర్షగిరి గోశాయి మీడియాకు తెలిపారు. కుటుంబ రాజకీయాలకు స్థానం లేకుండా చేసేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పార్టీకోసం ఎంతో కాలంగా సేవచేస్తున్న మరొకరికి టికెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు.

మోడీ కోడలికి కౌన్సిలర్ టికెట్ నిరాకరణ