NBK: బాలయ్య ఆగ్రహం.. మరోసారి చెంప చెల్లు!

10452

NBK: టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఆగ్రహం గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత సాధారణ ఎన్నికల ప్రచారంలో విజయనగరం జిల్లా చీపురుపల్లిలో టీడీపీ కార్యకర్తను బాలకృష్ణ వెంటపడి మరీ కొడుతున్న వీడియో వైరల్‌ అయ్యింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అభిమానిపై బాలయ్య దాడి చేయగా.. టీడీపీ జెండాలను తగులబెట్టి మరీ ఇక్కడ యువకులు నిరసన వ్యక్తం చేశారు. కాగా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా మళ్ళీ అదే సీన్ రిపీట్ అయింది.

గత మూడు రోజులుగా హిందూపురంలో బాలకృష్ణ రోడ్ షో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ వ్యక్తిపై ఎమ్మెల్యే బాలకృష్ణ చెయ్యి చేసుకున్నారు. హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురంలో ఓ అభ్యర్థి ఇంటికి వెళ్లిన బాలయ్య వారు ప్రేమగా ఇచ్చిన జ్యూస్ తాగారు. అయితే ఆ సమయంలో అక్కడ ఫోటో తీయడానికి అభిమాని ప్రయత్నించడంతో అతడిపై బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోటో తీయవద్దంటూ వారించిన ఆయన అనంతరం అభిమాని చెంపచెల్లుమనిపించారు.