నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ

288

తెలంగాణ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో పోటీ చెయ్యాలని నిర్ణయించుకుంది. సాగర్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఉప ఎన్నికపై చంద్రబాబు నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో టీడీపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు .. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేశాయి.

ఇక కాంగ్రెస్ నుంచి జానారెడ్డి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. నాగార్జున సాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ తాజాగా హాలియాలో సభ నిర్వహించారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య మృతితో ఇక్కడ ఖాళీ ఏర్పడింది. ఈ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.

నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ