మార్చిలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక!

86

తెలంగాణలో మరో ఉప ఎన్నిక జరగనుంది. నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో సాగర్ లో ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల కోసం అధికార ప్రతి పక్ష పార్టీలు దృష్టిపెట్టాయి. కాంగ్రెస్ కంచుకోటైన నాగార్జున సాగర్ లో 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సీనియర్ నాయకుడు జానారెడ్డి నర్సింహయ్య చేతిలో ఓటమి చవిచూశారు.

ఇక ఈ ఉపఎన్నికలు అధికార పార్టీకి పరీక్షలా మారాయి. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్ ఎన్నికల్లో పీఠానికి సరిపొయ్యే సీట్లు రాకపోవడం టీఆర్ఎస్ శ్రేణులు కొంత నిరాశలో ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ లో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉంది అధికార పార్టీ. మరోవైపు కాంగ్రెస్ కూడా తాము అలవోకగా గెలుస్తామని చెబుతుంది. బీజేపీ అప్పుడే అభ్యర్థి కోసం అన్వేషణ ప్రారంభించింది.

జానారెడ్డి కుమారుడిని పార్టీలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అటువైపు నుంచి మాత్రం ఎటువంటి సమాధానం లేదు. ఈ నియోజకవర్గం ఉపఎన్నిక మార్చి నెలలో జరిగే అవకాశం ఉంది తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఒకే సారి నిర్వహించనున్నారు అధికారులు

మార్చిలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక!