కూకట్‌పల్లి దుర్గామాత ఆలయంలో దుండగుల దుశ్చర్య

125

కూకట్‌పల్లిలోని దుర్గామాత ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడ్డారు. అమ్మవారి విగ్రహాన్ని పెకిలించడమే కాకుండా.. నాగదేవత విగ్రహాన్ని కూడా కూల్చివేశారు. ఘటనాస్థలంలో కుక్కను బలి ఇచ్చిన ఆనవాళ్లు కూడా కనిపించడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందారు.. సమాచారం అందుకున్న మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు పన్నాల హరీష్ చంద్రారెడ్డి , మరికొందరు బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఆలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.