నగరంలో మటన్ దుకాణాలు బంద్

161

గాంధీ వర్ధంతి సందర్బంగా జనవరి 30 తేదీన నగరంలోని మటన్, బీఫ్ దుకాణాలను మూసేయాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. సంబంధిత అధికారులు శనివారం వారి పరిధిలో గల ప్రాంతాల్లో పర్యటించి దుకాణాలు మూసి ఉన్నాయా? లేదా? పరిశీలించాలని కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. జనవరి 30 తేదీన మటన్, బీఫ్ దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు.