సంగీత దర్శకుడు రెహమాన్ ఇంట విషాదం

57

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రెహమాన్ తల్లి కరీమా బేగం సోమవారం మృతి చెందారు. గత కొంత కాలంగా కరీమా బేగం అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలుస్తుంది. తల్లి మృతితో రెహమాన్ విషాదంలో మునిగిపోయారు. కరీమా బేగం మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు. రెహమాన్ కు సానుభూతి ప్రకటించారు. మంగళవారం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.