ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

89
music director narendra bhide dies ,cardiac arrest
music director narendra bhide

ప్రముఖ సంగీత దర్శకుడు నరేంద్ర భిడే గురువారం ఉదయం పూణేలోని తన నివాసంలో మరణించారు. ఆయన వయసు 47 సంవత్సరాలు, భిడే గుండెపోటుతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీర్ అయిన భిడే.. సంగీతం పట్ల మక్కువతో మ్యూజిక్ డైరెక్టర్ గా మారారు ‘ఏ పేయింగ్ గోస్ట్’ (2015) లాంటి నాటకాలతోపాటు, డియోల్ బ్యాండ్ (2015), బయోస్కోప్ (2015), ఉబూన్‌ టు (2017) పుష్పక్‌ విమాన్‌, హరిశ్చంద్ర ఫ్యాక్టరీ, సానే గురూజీ, సరివర్ సారీ, ముల్షీ పాట్రన్‌ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన మరణం పట్ల పలువురు గాయకులు సంతాపం తెలిపారు.