ఏపీలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

263

ఏపీలో మరో ఎన్నికకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు పోలింగ్ జరుగనుంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. అలాగే మార్చి 13న రీపోలింగ్ ఉంటుందని ఎస్‌ఈసీ పేర్కొంది. అలాగే మార్చి 14 ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఇక నామినేషన్ ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు మార్చి 3 వరకు ఉంటుంది. అదే రోజు తుది జాబితాను ఎస్ఈసీ విడుదల చేయనుంది. 75 పురపాలక సంఘాలు, 12 నగర పాలక సంస్థలకు పోలింగ్ నిర్వహిస్తారు.

ఇక పంచాయితీ ఎన్నికల విషయానికి వస్తే, ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. చిన్న చిన్న ఉద్రిక్తతలు మిహన పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఫిబ్రవరి 17 తేదీన మూడో విడత పంచాయితీ ఎన్నికలు జరగనుండగా, చివరి విడత ఫిబ్రవరి 21 న జరగనుంది.. ఇక ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో వైసీపీనే ఆధిక్యం కనబరుస్తుంది.. ఏకగ్రీవాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. రాష్ట్ర విడిపోయిన తర్వాత పంచాయితీ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి.

2018 టీడీపీ హయాంలోనే జరగాల్సి ఉండగా, వాటిని వాయిదా వేస్తూ వచ్చారు. 2020 మార్చిలో జరుగుతాయని అందరు భావించారు. ఎంపీటీసీ, జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు కూడా స్వీకరించారు. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడ్డాయి. అయితే త్వరలో జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చేలా కనిపిస్తుంది. మార్చి చివరి వరకు స్థానిక ఎన్నికలను పూర్తిచెయ్యడమే ఎస్ఈసి లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది

ఏపీలో మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల