మున్సిపల్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జిలు వీరే

365

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీనిప్రకారం మార్చి 10 పోలింగ్‌ జరుగనుండగా, 14న ఓట్లను లెక్కిస్తారు. ఇక ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జులు, సమన్వయకర్తలను ఆ పార్టీ అధిష్ఠానం నియమించింది.

ఉత్తరాంధ్ర బాధ్యతలు జీవీఎల్‌ నరసింహారావు, కె.హరిబాబు, మాధవ్‌, విష్ణుకుమార్‌ రాజు, కాశీవిశ్వనాథరాజు, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు సుజనా చౌదరి, చిన్నం రామకోటయ్య, అంబికా కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిశోర్‌బాబు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలకు సీఎం రమేశ్‌, ఆదినారాయణరెడ్డి, వాకాటి నారాయణరెడ్డిలను నియమించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీజీ వెంకటేశ్‌, పార్థసారధి, వరదాపురం సూరి నియమితులయ్యారు.

నేటి నుంచే మునిసిపల్ ప్రచారంలో దిగనున్నారు. కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు సాగాలని అధిష్టానం సూచించింది. ఇక మునిసిపల్ ఎన్నికల్లో జనసేన – బీజేపీ ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తున్నాయి.

మున్సిపల్‌ ఎన్నికలకు భాజపా ఇన్‌ఛార్జిలు వీరే