పోర్న్ వీడియోస్ చిత్రీకరణ.. వలపన్ని పట్టుకున్న పోలీసులు

290

ముంబై నగరంలో పోర్న్ వీడియోల చిత్రీకరణ విచ్చలవిడిగా సాగుతున్నట్లు తెలుస్తుంది. గత కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందాను పోలీసులు పసిగట్టారు. అశ్లీల దృశ్యాలను చిత్రీకరిస్తున్న ముఠాకు సంబంధించి పోలీసులు మంగళవారం దర్శక నిర్మాత యాస్మిన్‌ బేగ్‌ ఖాన్‌ అలియాస్‌ దీపాంకర్‌ పరితోష్‌ ఖస్నావిస్‌ను అరెస్ట్‌ చేశారు. పోర్న్ వీడియోస్ రాకెట్‌తో ప్రమేయమున్న బ్రిటన్‌కు చెందిన ఫిల్మ్ ప్రొడక్షన్‌ హౌస్‌కు చెందిన ఉమేష్‌ కామత్‌ను ముంబై పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.

కాగా ముంబైలో కోస్టల్ ప్రాంతంతోపాటు, పలు రిసార్ట్స్ లో చిత్రీకరణ జరుగుతున్నట్లు పోలీసులు గురించారు. కాగా గతవారం ముంబైలోని మలద్‌ ప్రాంతం మథ్‌ ఐలండ్‌లోని ఓ బంగ్లాలో లైవ్‌ పోర్న్‌ వీడియో షూటింగ్‌ జరుపుతున్న బృందం గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ దాడిలో ఇద్దరు యువతులతోపాటు మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పోర్న్ వీడియోస్ చిత్రీకరణ.. వలపన్ని పట్టుకున్న పోలీసులు