అంబానీ ఇంటివద్ద బాంబు కలకలం

160

రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ ఇంటి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ స్కార్పియో వాహనాన్ని నిలిపి వెళ్లారు. చాలా సేపు పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన అంబానీ నివాసం వద్ద ఉన్న భద్రతా సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. వెంటనే బాంబ్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. వాహనం వద్దకు చేరుకున్న బాంబ్ స్క్వాడ్ నిశితంగా పరిశీలించారు.

వాహనంలో జిలెటిన్ స్టిక్స్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే కారును అక్కడినుంచి తరలించారు. కారును ఎవరు పార్క్ చేశారు అన్నది తెలియరాలేదు. కారు నంబర్ ప్లేట్ కూడా నకిలీదని పోలీసులు గుర్తించారు. విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. జిలెటిన్ స్టిక్స్ ప్రత్యేక్షం కావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అంబానీ ఇంటికి వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు నిర్వహించారు.

అంబానీ ఇంటివద్ద బాంబు కలకలం