Mukesh Ambani: ఆసియాలో మళ్ళీ అంబానీనే టాప్!

1106

లక్షల కోట్లలో వ్యాపారం కనుక ఒక ఏడాది ఆదాయం తగ్గొచ్చు.. మరో ఏడాది భారీ నష్టాలు రావచ్చు. అందుకే ప్రపంచ కుబేరుల జాబితా ఏటా కొంచెం తారుమారవుతూ ఉంటుంది. ఇక మన ఆసియాలో కూడా అత్యంత సంపన్నుల జాబితాలో తేడాలొస్తుంటాయి. కానీ గత రెండేళ్లుగా ఈ అగ్రస్థానం మాత్రం ముఖేష్ అంబానీ సొంతం చేసుకొని సంచలనంగా మారారు. ఆసియాలో అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్​ అంబానీ మరోసారి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. 80 బిలియన్ డాలర్ల సంపదతో ఆయన ఈ స్థానాన్ని పొందారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌ ముకేశ్ అంబానీ సంపద విలువ 8 వేల కోట్ల డాలర్లని బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ సూచీ వెల్లడించింది. ఆసియా అగ్రగామి కుబేరుల జాబితాలో గత రెండేళ్లలో ఎక్కువకాలం ముకేశే ఉండడం విశేషం. అంతకుముందు అగ్రస్థానంలో కొనసాగిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ అధిపతి జాక్ ‌మా నుంచి మొదటి స్థానాన్ని ముకేశ్ దక్కించుకున్నారు. డిసెంబర్‌లో చైనాకు చెందిన నాంగ్‌పూ స్ప్రింగ్ కంపెనీ అధిపతి జోంగ్‌ షాన్‌ ఆసియా అపరకుబేరుడిగా అవతరించారు. ఆయన సారథ్యంలోని వ్యాక్సిన్‌ తయారీసంస్థ బీజింగ్ వాంటాయ్‌ ఫార్మసీ షేర్‌ విలువ 20శాతం కోల్పోవడం వల్ల జోంగ్‌ షాన్ ఇప్పుడు‌ రెండో స్థానానికి పడిపోయారు.

Mukesh Ambani: ఆసియాలో మళ్ళీ అంబానీనే టాప్!