ముద్రగడకు షాక్ ఇచ్చిన రైల్వే కోర్టు.

327

2016 జనవరి 31న తునిలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన కాపు సమావేశం జరిగింది. కాపులను బీసీలలో చేర్చాలని ఈ సమావేశం ఉద్దేశం. అయితే ఈ సమావేశంలో అత్యుత్సహం ప్రదర్శించి రైతులు తగులపెట్టారు. రత్నా చల్ ఎక్స్ ప్రెస్ కు నిప్పు పెట్టారు.. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానప్పటికీ రైల్వే ఆస్తులను ధ్వంసం చెయ్యడం. ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడంతో పలువురిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేశారు.

రైల్వే చట్టం సెక్షన్ 146,147,153,174 కింద ముద్రగడతో సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక ఈ కేసుల విషయంలో మార్చి 3న కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ముద్రగడతో పాటు సమన్లు జారీ అయిన వారిలో మంచాల సాయి సుధాకర్ నాయుడు, మరికొందరు నిందితులు ఉన్నారు.

ముద్రగడకు షాక్ ఇచ్చిన రైల్వే కోర్టు.