నిమ్మగడ్డకు ఘాటు లేఖ రాసిన ముద్రగడ

66

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల రచ్చ జరుగుతుంది. మధ్యాహ్నం వరకు దీనిపై సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇక ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం, ఎస్ఈసీకి లేఖ రాశారు. ఉన్నత విద్యావంతులు మంచి ఉద్యోగంలో ఉండి రాజకీయాలు చేయడం తగదని అన్నారు. ఎన్నికలు అనేవి రాష్ట్రంలో పరిస్థితులను బట్టి నిర్వహించాలి కానీ రాజకీయ నాయకులులా పట్టుదలకు పోవద్దని సూచించారు. ఎవరో అదృశ్య శక్తి మీ వెనక ఉండి నడిపిస్తున్నట్లు అర్థమవుతుందని భావిస్తున్నట్లుగా ముద్రగడ పేర్కొన్నారు.

రమేష్ కుమార్ గారు మీ వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ముద్రగడ అన్నారు. వీలైతే సలహాలు ఇవ్వాలని ఇలా రచ్చ చేయకూడదని అన్నారు. మీరు ప్రభుత్వం కలిపి న్యాయ వ్యవస్థ కోసం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేయండి తప్ప వ్యక్తిగత పట్టుదలకు పోవద్దు ఇది నా మనవి. నా బాధ్యతగా భావించి ఈ లేఖ వ్రాస్తున్నా అని అన్నారు.

 

 

 

నిమ్మగడ్డకు ఘాటు లేఖ రాసిన ముద్రగడ