స్మార్ట్ ఫోన్లో చూస్తూ జాతీయగీతం ఆలపించిన ఎంపీడీఓ.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు

180

సామాన్యులకు జాతీయగీతం రాకపోయిన ఎవరు ఏమనుకోరు. అదే ఓ ఉన్నతాధికారికి జాతీయగీతం రాకపోతే అందరిలో నవ్వులపాలు కావడం కాయం. అయితే మంగళవారం నవ్వులపాలైయ్యే ఘటనే ఒకటి జరిగింది. 72వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జనగామ జిల్లా తరిగొప్పుల మండల కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా అందరు సెల్యూట్ చేసి జాతీయగీతాలాపన ప్రారంభించారు. ఇంతలో ఎంపీడీఓగా పనిచేస్తున్న ఇంద్రసేన రెడ్డి తన జేబులోంచి ఫోన్ బయటకు తీసి జాతీయ గీతం చూస్తూ పాడారు.

దీనిని ఫోటో తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఏముంది ఏం కాకూడదు అదే జరిగింది. జాతీయగీతం పాడరాదా అంటూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. నీ కంటే చిన్న పిల్లలు నయం అని విపరీతంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే సదరు అధికారి ఫోన్ లో జాతీయ గీతం చూసారా?, లేదంటే మరేదైనా చూసుకుంటూ జాతీయ గీతం ఆలపించారా? అనేది మాత్రం తెలియరాలేదు. నెటిజన్లు మాత్రం అతడు చూస్తుంది జాతీయగీతమే అని నిర్ధారించారు.

స్మార్ట్ ఫోన్లో చూస్తూ జాతీయగీతం ఆలపించిన ఎంపీడీఓ