14 ఏళ్ల బాలికను పెళ్లాడిన ఎంపీ

622

సాక్షాత్ ఓ ఎంపీ 14 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్ దేశంలోని బలోచిస్థాన్ లో చోటుచేసుకుంది. ఈ వ్యవహారం సంచలనంగా మారింది. బలోచిస్థాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడైన జమియత్ ఉలేమా ఎ ఇస్లాం నాయకుడు మౌలానా సలాహుద్దీన్ అయూబీ 14 ఏళ్ల బాలికను వివాహం చేసుకున్నాడు. ఎంపీ పెళ్లి చేసుకున్న బాలిక జుగుర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థిని.. బాలిక వివాహంపై మహిళా సంక్షేమ స్వచ్చంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దింతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

బాలిక తల్లిదండ్రులను విచారించగా అలాంటిది ఏమి జరగలేదని దబాయించారు. గట్టిగ విచారణ చెయ్యడంతో నిజమే అని ఒప్పుకున్నారు. ఐతే తమ బాలికను మరో రెండేళ్లు తమ వద్దే ఉంచుకుంటామని ఆ తర్వాత పంపుతామని బాలిక తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే పాకిస్థాన్ చట్టాల ప్రకారం 16 ఏళ్ళు నిండిన తర్వాతనే బాలికలకు పెళ్లి చెయ్యాలి.. లేదంటే తల్లిదండ్రులు శిక్షార్హులు అవుతారు. సాక్షాత్తూ ఎంపీనే చట్టానికి విరుద్ధంగా మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటన పాకిస్థాన్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. అయితే సదరు బాలిక 2006 అక్టోబర్ 26 న జన్మించినట్లు పాఠశాల రికార్డులలో ఉంది.

14 ఏళ్ల బాలికను పెళ్లాడిన ఎంపీ