MP Revanth reddy : ఎంపీ అరవింద్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం

329

Mp revanth reddy fires : కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలోని అర్ముర్ లో శనివారం రాజీవ్ రైతు భరోసా దీక్ష చేపట్టింది. ఈ దీక్షలు కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులను ఆగం చేస్తుందని అన్నారు. స్థానిక ఎంపీ అరవింద్ పై విమర్శలు గుప్పించారు. రెండు రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అన్న అరవింద్ 20 నెలలు గడిచినా బోర్డు తేలకపోయారని విమర్శించారు. బీజేపీ తరపున ప్రచారానికి వచ్చిన రామ్ మాధవ్ కూడా పసుపు బోర్డు తీసుకొస్తామని తెలిపారని, కానీ ఆ హామీని విష్మరించారని మండిపడ్డారు.

బాండు పేపర్లు రాసిచ్చిన అరవింద్ పసుపు బోర్డు తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారో ప్రజలకు తెలపాలని అన్నారు రేవంత్. కేసీఆర్ కూతురుని ఓడించి మంచి పేరు తెచ్చుకున్నారని కానీ ప్రజలకు మేలు చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పసుపు రైతులతో కలిసి ఢిల్లీ వెళ్తామని అన్నారు రేవంత్. వారు తేదీ చెబితే వారితోపాటు తను కూడా వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి పసుపు రైతుల సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. అనంతరం టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి అటకెక్కినని అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందని తెలిపారు రేవంత్.

MP Revanth reddy : ఎంపీ అరవింద్ పై రేవంత్ రెడ్డి ఆగ్రహం