వెరైటీ మాస్క్ పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేంద్ర

276

కరోనాతో మాస్క్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. మాస్క్ లేకుండా ఎవరు బయటకు రావడం లేదు. కొందరైతే స్పెషల్ గా చేయించుకున్న మాస్కులను పెట్టుకొని ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఇక సోమవారం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ నరేంద్ర జాదవ్ ప్రత్యేక మాస్క్ ధరించి పార్లమెంట్ కి వచ్చారు. దింతో అందరి దృష్టి నరేంద్రపై పడింది. హై ఎఫీషియన్సీ పార్టికులేట్ ఎయిర్‌(హెచ్ఈపీఏ) మాస్క్ ధరించి సభకార్యక్రమాలకు హాజరయ్యారు. ఎంపీ నరేంద్ర ధరించిన మాస్క్ సామర్థ్యం 99.7 శాతంగా ఉన్నట్లు తేలింది. ఈ మాస్క్ నుంచి శరీరంలోకి చాలా స్వల్ప స్థాయిలో పార్టికిల్స్ వెళ్తాయని ఎంపీ నరేంద్ర తెలిపారు. అయితే ఆ మాస్క్‌ను తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి డిజైన్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

వెరైటీ మాస్క్ పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేంద్ర