కరోనాతో ఎంపీ మృతి

151

కరోనాతో బీజేపీ ఎంపీ నంద్ కుమారు సింగ్ చౌహన్ మృతి చెందారు. గురుగ్రామ్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం చౌహన్ కన్నుమూశారు. నంద్‌కుమార్‌ మధ్యప్రదేశ్‌ ఖండ్వ లోక్‌సభ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో భోపాల్‌ లో చికిత్స పొందుతున్న ఆయనని గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు తరలించారు. రెండు నెలల క్రితం ఎంపీకి కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన కరోనాతో పోరాడుతూ వెంటిలేటర్ పైనే ఉన్నారు.

పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందారు. ఆయన స్వస్థలం నిమార్‌లోని బుర్హాన్‌పూర్‌ జిల్లాలోని షాపూర్‌. 8 సెప్టెంబర్‌, 1952లో జన్మించారు. 1996లో షాపూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడిగా రాజకీయ జీవితం ప్రారంభించారు. నంద్‌కుమార్ మృతిపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సంతాపం తెలిపారు.

కరోనాతో ఎంపీ మృతి