వైసీపీకి షాకిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. టీడీపీకి మద్దతు

186

పోలీస్ కొలువు వదులుకొని వైసీపీలో చేరి హిందూపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా గెలిచిన గోరంట్ల మాధవ్ మరో సారి వార్తల్లో నిలిచారు. గతంలో జేసీ బ్రదర్స్ ఒంటికాలిపై లేచి ఫేమస్ అయిన ఈ పోలీస్ బాస్, పంచాయితీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చి వైసీపీ నేతలను షాక్ కి గురి చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ సొంత ఊరు కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామం. అక్కడ టీడీపీ బలపరిచిన అభ్యర్థి ఎంకే మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ వేసినప్పటికీ అతడు ఉపసంహరించుకున్నారు.

దింతో టీడీపీ అభ్యర్థి మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ గా ఎన్నికైన మధు గోరంట్ల మాధవ్‌కు దగ్గర బంధువు. దీంతో మధుకు, మాధవ్ మద్దతు తోడవ్వడంతో ఏకగ్రీవం అయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మాధవ్ తీరుపై వైసీపీ నేతలు మండిపడుతుంటున్నారు. సొంతపార్టీ వారిని కాదని టీడీపీ వారిని ఏకగ్రీవం చెయ్యడం ఏంటని అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పార్టీని సమర్ధించకుండా బంధువుకు మద్దతిచ్చారంటూ వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

వైసీపీకి షాకిచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్.. టీడీపీకి మద్దతు