Theaters Occupancy : తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

140

రాష్ట్రంలోని థియేటర్లలో ప్రేక్షకులను అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం వందశాతం ప్రేక్షకులకు అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీచేసింది.. ఈ మేరకు ప్రకాశం జవదేకర్ వివరాలు మీడియాకు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం థియేటర్ ఆక్యుపెన్సీ పెంచేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సినిమాలు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లలో 100 శాతం సీట్లను నింపుకోవడానికి అనుమతి ఇస్తున్నట్లు అందులో స్పష్టం చేసింది. గతేడాది అక్టోబర్‌లోనే థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చినా.. ఇప్పటి వరకు కేవలం 50 శాతం కెపాసిటీతోనే నడపడానికి అనుమతి ఉండేది. ఇలా నడపడం వలన థియేటర్ల యజమానులు నష్టపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం, కరోనా కేసులు కూడా తగ్గిపోవడంతో వందశాతం ప్రేక్షకులకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది.

Theaters Occupancy : తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు