కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా ఇకలేరు

57

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోతీలాల్ వోరా మరణించారు.. వయసు 93 సంవత్సరాలు. వయసు మీదపడటంతో ఆయన కొంతకాలంగా అనారోగ్యం బారిన పడ్డారు. ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. మోతీలాల్ వోరా రెండుసార్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1985-1988 వరకు మొదటిసారి 1989లో మరోసారి మధ్యప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు.

మోతీలాల్ వోరా మృతికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. “వోరా జి నిజమైన కాంగ్రెస్ వాది.. ఆయన మంచి తెలివైన వ్యక్తి” మేము ఆయనను కోల్పోవడం చాలా విచారకరం.. ఆయన కుటుంబానికి నా సానుభూతి.” అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.