ఆవేశంలో తల్లి ఆత్మహత్య – అనాథలైన ఇద్దరు కుమార్తెలు

73

ఓ మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. జిల్లాలోని కుప్పం నియోజకవర్గం తంబిగనిపల్లి కొట్టాలులో కవిత అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే 22 ఏళ్ల కవితకు.. గోవిందరాజుతో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల కవిత మరోసారి గర్భవతి అయ్యింది. అయితే తనకు మరొకరిని కనడం ఇష్టం లేదని ఆపరేషన్ చేయించుకుంటానని భర్త గోవిందరాజుకు తెలిపింది.

అందుకు భర్త నిరాకరించాడు. మగ పిల్లోడు లేడని.. గర్భం ఉంచుకోవాల్సిందే అంటూ బలవంతం చేశాడు. దింతో గోవిందరాజు, కవిత మధ్య వాగ్వాదం జరిగింది. దింతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కవిత మృతితో ఆమె ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మిగిలిపోయారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.