కవల పిల్లలను ఎత్తుకెళ్లిన కోతులు.. ఒకరు మృతి.

228

వనాల్లోఉండాల్సిన కోతులు జనాల్లోకి వచ్చాయి. జనావాసాల్లో బీభత్సం సృష్టితున్నాయి. ఎప్పుడు ఎవరిమీద ఎగబడతాయో, ఎవరిని కరుస్తాయో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే తమిళనాడులో కోతుల గుంపు కవల శిశువులను ఎత్తుకెళ్లాయి. ఒకరిని కందకంలో పడేయగా, మరొకరిని ఇంటిపైకప్పుపై వదిలేశాయి. ఈ ఘటనలో కందకంలో వదిలేసిన శిశువు మృతి చెందింది. ఈ హృదయ విదారక ఘటన తంజాపూర్ మేలవీధిలోని కోట్టై అగళి ప్రాంతంలో జరిగింది. రాజ, భువనేశ్వరి దంపతులు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చారు.

శనివారం ఇంట్లో చాపపై శిశువులను పడుకోబెట్టి భువనేశ్వరి స్నానికి వెళ్లారు. కొద్దిసేపటికి కోతుల గుంపు వచ్చిన శబ్ధం వినిపించింది. వెంటనే భువనేశ్వరి ఇంట్లోకి వెళ్లి చూడగా శిశువులు కనిపించలేదు. దింతో ఇంటి చుట్టూ పరిశీలించింది.. ఓ పాప ఇంటిపై కనిపించడంతో ఏడ్చుకుంటూ కేకలు వేసింది. దింతో చుట్టుపక్కలవారు వచ్చి కోతులను తరిమారు.. ఇంటిపైకప్పు నుంచి శిశువును సురక్షితంగా కిందకు దించారు. మరో శిశువు కనిపించకపోవడంతో వెతికారు.. ఇంటిపక్కనే ఉన్న కందకంలో పడేశాయి కోతులు.. వెంటనే శిశువును తీసుకోని ఆసుపత్రికి వెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

తమ బిడ్డ మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కాగా గత కొంతకాలంగా గ్రామంలో పెద్ద కోతుల గుంపు తిరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. అవి మనుషులపై ఎగబడి దాడికి కూడా దిగుతున్నాయని అంటున్నారు. కోతులను గ్రామంలోంచి తరమాలని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు గ్రామస్తులు.

కవల పిల్లలను ఎత్తుకెళ్లిన కోతులు.. ఒకరు మృతి.