సోహెల్‌తో మోనాల్ ఎంజాయ్.. పాపం అఖిల్!

385

మోనాల్ గజ్జర్.. బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లెవరకూ ఈ అమ్మడి పేరు పెద్దగా తెలియదు. తెలుగులో కూడా అప్పటికే సినిమాలు చేసినా గుర్తు పెట్టుకొనేంత పెద్ద సినిమాలు కాకపోవడంతో మోనాల్ బిగ్ బాస్ ఇంటికి వచ్చేవరకు కొత్త ఫేస్ గానే కనిపించింది. అయితే.. ఆ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో కెమెరాలను తన వైపుకు తిప్పుకొనేందుకు ఎన్ని విధాలుగా చేయాలో అంతా చేసింది. బిగ్ బాస్ ఇంట్లో అంత గ్లామర్ ఒలకబోయొచ్చని.. అన్ని యాంగిల్స్ లో ప్రేమ కథలు నడపొచ్చని మోనాల్ ని చూసేవరకు ఆ టీవీ ప్రేక్షకులకు కూడా తెలియదేమో.

 బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ తాజాగా తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. సోహెల్‌తో పాటు ఉన్న మోనాల్ ఆ ఫోటోను ఉద్దేశిస్తూ.. ఇక ఇద్దరం కలిస్తే.. రచ్చ రచ్చే అంటూ రాసుకుంది.  Photo : Instagram

మొత్తంగా బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తంలో హైలెట్ గా నిలిచింది మోనాల్ ప్రేమ కథలే. అటు సోహెల్.. ఇటు అఖిల్ తో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడిపిన మోనాల్ బయట కూడా ఇద్దరితో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది. అయితే.. ఒక టైంలో మోనాల్ అఖిల్ ప్రేమ ఒక్కటే నిజమని ప్రచారం జరిగింది. కానీ తీరా చూస్తే ఈ మధ్య మోనాల్ సోహెల్ తో రాసుకుపూసుకు తిరిగేస్తుంది. ఇద్దరూ కలిసి పార్టీల పేరుతో రచ్చ రచ్చ చేస్తున్నారు. చేసే రచ్చ గుర్తుగా ఫోటోలు తీసి వాటిలో సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తున్నారు.

 ఓ టీవీ షో కార్యక్రమానికి హాజరైన ఈ ఇద్దరూ కలిసి ఫోటో దిగారు. దానికి సంబంధించిన ఓ పిక్‌ను మోనాల్ తన సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌తో పంచుకుంది. ఇక ఇది చూసిన  ఇద్దరీ ఫ్రెండ్ మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ నిజం ఒప్పుకున్నారు అంటూ కామెంట్ పెట్టాడు. దానికి సోహెల్ బదులిస్తూ మేం కలిస్తే రచ్చ ఇలాగే ఉంటది.. యస్ వి ఆర్ క్రేజీ అంటూ రిప్లై  ఇచ్చాడు. Photo : Instagram

తాజాగా మోనాల్ తన సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్ట్ చేసింది. సోహెల్‌తో పాటు ఉన్న మోనాల్ ఆ ఫోటోను ఉద్దేశిస్తూ.. ఇక ఇద్దరం కలిస్తే.. రచ్చ రచ్చే అంటూ రాసుకుంది. ఓ టీవీ షో కార్యక్రమానికి హాజరైన ఈ ఇద్దరూ కలిసి ఈ ఫోటో దిగారు. ఇందులో ఇద్దరి బాండింగ్ చూసిన నెటిజన్లు పాపం అఖిల్ అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఏ మాటకామాట కానీ ఎవరిని ఎలా వాడుకోవాలో.. సిట్యువేషన్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మోనాల్ కు తెలిసినంతగా మిగిలిన ఆ ఇద్దరికీ తెలియదు. ఆ విషయం బిగ్ బాస్ ఇంట్లోనే చూశాం. ఇన్ని తెలిసాక కూడా పాపపుణ్యాల లెక్క ఎక్కడుంది మరి!

 Bigg Boss Telugu 4 : మైమరిపిస్తోన్న బిగ్ బాస్ ప్రేమ పావురం మోనాల్ గజ్జర్ నడుమందాలు.. Photo : Instagram

సోహెల్‌తో మోనాల్ ఎంజాయ్.. పాపం అఖిల్!