మోడీకి బ్రహ్మరథం.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే 321 సీట్లు పక్క

290

మోడీ భారత రాజకీయాల్లో ఓ ప్రభంజనం. ఉపద్రవాలను ఎదురుకోవడం ఉద్యమాలను అనచడంలో దిట్ట. ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేపడతాడనే పేరు మోడీకి ఉంది. అందుకే ఎన్డీఏ 2013లో ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించింది. నాటి నుంచి మోడీ చరిష్మా పెరుగుతూనే వస్తుంది. 2014 ఎన్నికల్లో సొంతంగా 283 సీట్లు గెలిపించారు మోడీ. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో 303 సీట్లను సొంతంగా గెలుచుకుంది బీజేపీ. దింతో దేశంలో తిరుగులేని నేతగా ఎదిగారు మోడీ.

కరోనా మహమ్మారి సమయంలో మోడీ వ్యవహరించిన విధానాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కరోనా కేసులను కట్టడి చెయ్యడంలో మోడీ విఫలమయ్యారని ఓ పక్క ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి, చప్పట్లు కొట్టించారని హేళన చేశాయి, పూలు చల్లించారని నవ్వుకున్నాయి. కానీ వీటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయారు మోడీ. ఎప్పటికప్పుడు వాక్సిన్ తయారీపై శాస్త్రవేత్తలతో మాట్లాడుతూ వారికీ ధైర్యాన్ని ఇచ్చారు. శాస్త్రవేత్తల కృషికి ఫలితం వచ్చింది. దేశంలో రెండు కరోనా వాక్సిన్స్ తయారయ్యి. దింతో ఇప్పుడు అన్ని దేశాల చూపు భారత్ వైపు మళ్లింది. తమకు కరోనా వాక్సిన్ కావాలంటూ క్యూ కడుతున్నాయి ప్రపంచ దేశాలు.

ఇది ఇలా ఉంటే తాజాగా ‘ఇండియా టుడే –కార్వీ’ జరిపిన ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ సర్వే ప్రకారం బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకు ప్రజల ఆదరణ ఉందని తెలిపింది. 43% ఓట్లతో 321 స్థానాలను ఎన్డీఏ గెలుచుకుంటుందని తేల్చింది. అయితే ఇదే సర్వే గతేడాది ఆగస్ట్‌లో చేయగా ఎన్‌డీఏ 316 సీట్లు గెలుచుకుంటుందని తేలింది. ఈ విధంగా రోజురోజుకు మోదీ చరిష్మా పెరుగుతూనే ఉంది. ఇక మరికొన్ని రాష్ట్రాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని తేలింది. ఈ సర్వేపై కొందరు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు.

బలమైన ప్రతిపక్ష నేత లేకపోవడంతోనే మోడీకి అనుకూలంగా సర్వేలు వస్తున్నాయని అంటున్నారు. రాహుల్ గాంధీ లాంటి వారితో మోడీని ఓడించడం సాధ్యం కాదని వారు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీని ముందు పెట్టి కాంగ్రెస్ ఎన్నికలకు పొతే ఆ పార్టీ మోడీ ఉన్ననాలు అధికారంలోకి రాదని చెబుతన్నారు. దేశ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకోవాలని సూచిస్తున్నారు. రాహుల్ ప్రజల మనసులను గెలవడంతో విఫలమవుతున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. రాహుల్ ను దేశ ప్రధానిగా ఎన్నుకునేందుకు దేశ ప్రజలు ఆసక్తిగా లేరని, ప్రజాకర్షణ గల నేతలు ప్రతిపక్షంలో లేనంత వరకు మోడీదే హావ అని అంటున్నారు.

ఇక మరోవైపు మోడీ అమలు చేసుకున్న అభివృద్ధి పథకాలు కూడా ప్రజలను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తుంది. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా మోడీ తీసుకొచ్చిన పథకాలు అందరి దృష్టిని ఆకర్షించినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ews రిజర్వేషన్ అనేది ఎవరు ఊహించని నిర్ణయమని అంటున్నారు. ఇలా మంచి కార్యక్రమాలు చేస్తుండటంతో ఆయన చరిష్మా మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇక మమతా, మాయావతి, కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి నాయకులు ప్రధాని కావాలని ఆశపడుతున్న వారి మధ్య సఖ్యత కొరవడిన సంగతి స్పష్టంగా అర్థమవుతుందని తెలిపారు.

ప్రాంతీయ పార్టీలు ఏకమైతే మోడీని ఓడించగలవేమో కానీ ప్రజలకు మంచి పరిపాలన అందించడంలో విఫలమవుతాయని చెబుతున్నారు విశ్లేషకులు.

మోడీకి బ్రహ్మరథం