పాకిస్థాన్ లో మోడీ ఫలకార్డులు

237

దాయాది దేశం పాకిస్థాన్ లో మోడీ ఫలకార్డులు దర్శనమించాయి. ఆయనతోపాటు మరికొందరు ప్రపంచ నేతల ఫలకార్డులను కూడా ప్రదర్శించారు. పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను కోరుకుంటూ చేస్తున్న ఆందోళనల్లో మోడీ పలువురు నేతల ఫలకార్డులను ప్రదర్శించారు ఉద్యమకారులు. ఈ సందర్బంగా పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక సింధుదేశ్ ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశం విభజనకు మోడీ లాంటి నాయకులు తోడ్పడాలని వారు కోరారు.

తాము పాకిస్థాన్ లో తీవ్ర వ్యతిరేకంగా ఎదురుకుంటున్నామని తెలిపారు. అంటరానివారిగా తమను పాకిస్తానీయులు పరిగణిస్తున్నారని వారు వాపోయారు. కాగా సింధీ నేషనలిజం వ్యవస్థాపకుల్లో ఒకరైన జీఎం సయ్యద్ 117వ జయంతి సందర్బంగా అయన సొంతూరైన సింధ్ ప్రావిన్స్ లోని సాన్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలిలోనే ప్రపంచ దేశాల నేతల ఫలకార్డులు ప్రదర్శించారు.

కొత్తదేశం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అయితే పాకిస్థాన్ కు ఇప్పటికే బెలూచిస్తాన్ గట్టిగ తగులుతుంది. తాజాగా సింధుదేశ్ డిమాండ్ కూడా పెరిగింది. బెలూజ్ నేతలు ఏకంగా దాడులకు దిగుతున్నారు. పాక్ సైన్యాన్ని టార్గెట్ గా చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఈ దాడుల్లో ఇప్పటికే వందలమంది సైనికులు మృతి చెందారు.

ఇక బెలూజ్ ప్రాంతంలో పనిచేసిన చైనా సైన్యాన్ని దెబ్బకొట్టేందుకు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. బెలూజ్ ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ కుట్ర చేస్తుందని పసిగట్టిన బెలూజ్ ఏర్పాటు వాదులు చైనా సైన్యాన్ని ఎదురుకునేందుకు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. మరోవైపు పాకిస్థాన్ ను అన్ని దేశాలు ఆర్ధిక బహిష్కరణ చేశాయి. అత్యంత కఠినమైన ఆంక్షలు విధించాయి.

పాకిస్థాన్ లో మోడీ ఫలకార్డులు