అంతరిక్షంలోకి మోడీ ఫోటో, భగవద్గీత..!

164

ఇండియా ఇప్పటికే నింగిలోకి ప్రయాణంలో ఎన్నో మైలురాళ్ళని అధిగమించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఫొటోతోపాటు ఓ భ‌గ‌వ‌ద్గీత కాపీ, 25 వేల మంది పేర్ల‌ను అంత‌రిక్షంలోకి పంపనున్నారు. ఈ శాటిలైట్‌కు స‌తీష్ ధావ‌న్ లేదా ఎస్‌డీ శాట్ అనే పేరు పెట్టారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్‌వీ) ద్వారా ఈ శాటిలైట్‌ను పంపించ‌నున్నారు. ఈ శాటిలైట్‌ను SpaceKidz ఇండియా అభివృద్ధి చేసింది. spaceKidz అంటే ఇది విద్యార్థుల్లో స్పేస్ సైన్స్‌ను ప్రోత్స‌హించే సంస్థ‌ కాగా ఈ సంస్థ అభివృద్ధి చేసిన తొలి శాటిలైట్ ఇదే కావడం విశేషం.

spaceKidz రూపొందించిన ఈ శాటిలైట్ ప్రధాని ఫోటో, భగవద్గీత, 25 వేలమంది పేర్లతో పాటు మ‌రో మూడు పేలోడ్స్‌ను కూడా తీసుకెళ్ల‌నుంది. ఇందులో ఒక పేలోడ్ స్పేస్ రేడియేష‌న్‌ను, ఒక‌టి మాగ్నెటోస్పియ‌ర్‌ను అధ్య‌య‌నం చేయ‌నుండ‌గా మ‌రొక‌టి లోప‌వ‌ర్ వైడ్ ఏరియా క‌మ్యూనికేష‌న్ నెట్‌వ‌ర్క్ కోసం పంపిస్తున్నారు. త‌మ శాటిలైట్ నింగిలోకి దూసుకెళ్లే క్ష‌ణం కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న‌ట్లు SpaceKidz ఇండియా సీఈవో డాక్ట‌ర్ శ్రీమ‌తి కేశ‌న్ చెప్పారు.

ఈ మిష‌న్‌ను అనుకున్న‌ప్పుడు అంతరిక్షంలోకి తమ పేర్లు వెళ్లాలని కోరుకొనే వారు పేర్లు పంపించాల్సిందిగా ప్ర‌జ‌ల‌ను కోరగా.. వారం రోజులలోనే 25 వేల మంది పేర్లు వ‌చ్చాయని.. ఈ పేర్ల‌తోపాటు ప్ర‌ధాని ఫొటోను, ఓ భ‌గ‌వ‌ద్గీత కాపీని కూడా పంపుతాము అని కేశ‌న్ వెల్ల‌డించారు. ఇప్ప‌టికే పేర్లు పంపిన వారికి బోర్డింగ్ పాస్ ఇచ్చిన‌ట్లు తెలిపిన కేశన్.. ఈ పేర్ల‌లో ఇస్రో చైర్‌ప‌ర్స‌న్ కే శివ‌న్‌, సైంటిఫిక్ సెక్ర‌ట‌రీ ఉమామ‌హేశ్వ‌ర‌మ్ పేర్లు కూడా ఉన్న‌ట్లు చెప్పారు.

అంతరిక్షంలోకి మోడీ ఫోటో, భగవద్గీత..!