చెట్టుపై వెలిసిన నరేంద్ర మోడీ

110

కవికి ఏది సాటి రాదు, కళాకారుడి ప్రతిభకు ఏది అడ్డురాదు అనే నానుడి ఉంది. కొందరు కళాకారులు చేసే ప్రదర్శనలు మనసులకు హత్తుకుంటాయి. అటువంటిదే ఇది. ఒడిసా మయూరభంజ్‌లోని సిమిలిపాల్ నేషనల్ పార్క్‌లోని చెట్టుపై ఒక కళాకారుడు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని చెక్కారు. ప్రస్తుతం అతడు చెక్కిన చిత్రం అందరిని ఆకట్టుకుంటుంది.

సమరేంద్ర బెహెరా అనే కళాకారుడు ఈ చిత్రాన్ని చెక్కడం జరిగింది. “ఈ చిత్రం ద్వారా, అడవిలో అక్రమంగా చెట్లను నరికివేయడాన్ని గమనించాలని బెహెరా మోడీకి అభ్యర్ధించారు. ఈ సందర్బంగా సమరేంద్ర మాట్లాడుతూ దేశంలో వృక్ష సంపద తగ్గిపోతుందని, చర్యలు తీసుకోవాలని కోరారు. సిమిలిపాల్ పార్క్ లో చెట్లను అక్రమార్కులు నరికి తీసుకెళ్తున్నారని, ఆలా జరగకుండా చూడాలని తెలిపారు. కాగా మోడీ చిత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

చెట్టుపై వెలిసిన నరేంద్ర మోడీ