కొత్త కార్మిక చట్టాలు.. 15 నిముషాలు ఎక్కువ పని చేసినా వేతనం ఇవ్వాలి

145

ఈ ఆధునిక యుగంలో మనిషి యంత్రంలా మారిపోయాడు. రెస్ట్ అనేది లేకుండా నిరంతరం శ్రమిస్తున్నాడు. కార్యాలయం, ఇల్లు ఈ రెండు తప్ప మరో ద్యాస లేకుండా పోతుంది. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక చట్టాలు ఇటువంటి వారికీ బాగా ఉపకరించేలా ఉంది. వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే పని దినాలు పెట్టాలని చూస్తుంది. దీని ప్రకారం కార్మికులు కంపెనీలో పనివేళలకు అదనంగా(ఓటీ) పని చేస్తే.. అందుకు వేతనం చెల్లించాలనే కొత్త నిబంధనను పరిశీలిస్తోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దీని అమలుకు సన్నాహాలు చేస్తోంది. కంపెనీలో పనివేళలు ముగిసిన తర్వాత ఒక కార్మికుడు 15 నిముషాలు అదనంగా పనిచేస్తే దానికి కూడా సదరు కంపెనీ వేతనం చెల్లించాలని ఈ చట్టం చెబుతోంది. ఈ విధంగా కేం‍ద్రం కొత్త నిబంధనలు, చట్టాలు ద్వారా కార్మికులకు కొంత పని ఒత్తిడి తగ్గించడంతోపాటు, పనిలో ఉత్పాదకత పెరిగే దిశలో ప్రోత్సాహిస్తోంది. ఇవి అమలైతే శ్రమ దోపిడీ తగ్గుతుందని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు.

కొత్త కార్మిక చట్టాలు.. 15 నిముషాలు ఎక్కువ పని చేసినా వేతనం ఇవ్వాలి