మోడీ, షాపై 10 కోట్ల డాలర్ల దావా..కొట్టేసిన కోర్టు

176

ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై కాశ్మీర్ ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ వేసిన దావాను అమెరికా కోర్టు కొట్టేసింది. కాశ్మీర్ రాష్ట్రాన్ని విభజించి,, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ విభజనను వ్యతిరేకిస్తూ మోదీ, అమిత్ షా, లెఫ్ట్‌నెంట్ జనరల్ కన్వల్‌జీత్ సింగ్ ధిల్లాన్ నుంచి తమకు నష్ట పరిహారంగా 10 కోట్ల డాలర్లు ఇప్పించాలని కశ్మీర్ ఖలిస్తాన్ రెఫరెండమ్ ఫ్రంట్ అమెరికా కోర్టులో దావా చేసింది.

వీరి తరపున వేర్పాటువాద లాయర్ గుర్పత్‌వంత్ సింగ్ పన్నమ్ వాదనలు వినిపించారు. కాగా దావా వేసిన వారు రెండు సార్లు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు కొట్టివేసింది. . ఈ దావాను గతేడాది సెప్టెంబర్ 19న ఫైల్ చేశారు. హూస్టన్‌లో ప్రధాని మోదీ హౌడీ, మోదీ ప్రోగ్రామ్‌కు కొన్ని రోజుల ముందే ఈ దావా వేయడం విశేషం.

మోడీ, షాపై 10 కోట్ల డాలర్ల దావా..కొట్టేసిన కోర్టు