ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం

226

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14న ఎమ్మెల్సీ పోలింగ్ ఉండగా నేడు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా అభ్యర్థిగా చిన్నారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 5.60 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని మూడవ అంతస్తులో ఉన్న రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలాకి అభ్యర్థులు నామినేషన్‌ను అందించనున్నారు.

మరోవైపు అభ్యర్థులు ఎన్నికల ప్రచారం షురూ చేశారు. పట్టభద్రులను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. తాము గెలిస్తే నిరుద్యోగుల సమస్య తీర్చుతామని హామీ ఇస్తున్నారు. బీజేపీ అభ్యర్థులు నిరుద్యోగ భృతిపై కొట్లాడతామని చెబుతున్నారు. కాంగ్రెస్ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కరిస్తామని, పియర్సీ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెబుతన్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఇదే ప్రచారం చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఉద్యోగాలు కల్పించామని వివరిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభం