తండ్రి ఎమ్మెల్సీ, కొడుకు సర్పంచ్

181

పంచాయితీ ఎన్నికల మూడో దశ పోలింగ్ బుధవారం ముగిసింది. ఈ దశలో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులే అధికంగా విజయం సాధించారు. ఇక మూడో దశలో గుంటూరు జిల్లాలోని గురజాల నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో దాచేపల్లి మండలం గమలపాడు గ్రామపంచాయితీ నుంచి ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తి రెండో కుమారుడు జాంగా సురేష్ గమలపాడు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మొదట ఇక్కడ సురేష్ పై పోటీకి టీడీపీ, జనసేన అభ్యర్థులు సిద్ధమయ్యారు. కానీ చివరకు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. గ్రామస్తులంతా కలిసి ఆయనకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగా సురేష్ బీటెక్ పూర్తి చేసి ఢిల్లీలో సివిల్స్ కు శిక్షణ తీసుకుంటున్నారు. కృష్ణమూర్తి పెద్ద కుమారుడు వెంకట కోటయ్య పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. దాచేపల్లి మండలంలో ఎక్కువగా ఏకాగ్రవాలే అయ్యాయి. ఇక ఈ మండలంలో ఒక పంచాయితీలో జనసేన బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు.

తండ్రి ఎమ్మెల్సీ, కొడుకు సర్పంచ్