Telangana : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

186

ఎమ్మెల్సీ ఎన్నికలకు తెలంగాణ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 16 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మార్చి 14 రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఫిబ్రవరి 23 వరకు నామినేషన్ దాఖలుకు అవకాశం ఉంది. 24 న నామినేషన్ పరిశీలన ఉంటుంది. ఉపసంహరణకు ఫిబ్రవరి 26 వరకు గడువు ఉంది. ఇక పోలింగ్ మార్చి 14 జరగనుంది. 14 ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 17 న ఫలితాలు విడుదల చేస్తారు.

కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తోపాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం స్థానానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూన్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులకు ప్రకటించాయి. గ్రౌడ్ లోకి వెళ్లి ప్రచారం కూడా ప్రారంభించారు అభ్యర్థులు.

ఇక ఇదే షెడ్యూల్ లో ఆంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

Telangana : ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల