వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి ఇకలేరు

423

కర్నూల్ జిల్లా బనగానిపల్లె నియోజకవర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కరోనాతో మృతిచెందారు. గత నెల ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో గత నెల 13న
హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. కాగా చల్లా రామకృష్ణారెడ్డికి 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

See also : రైతు ఇంట్లో అమిత్ షా భోజనం.. కారణం ఇదే?