కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే రోజా

435

నగరి ఎమ్మెల్యే నటి రోజా కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతిలో జరిగిన ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న రోజా అధికారులు ఆమె మాట వినడం లేదని అన్నారు. తనను పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీస మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే నియోజకవర్గ సమస్యలు, ప్రోటోకాల్ విషయంపై అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు. ఏదైనా సమావేశాలు జరిగినా తనకు సమాచారం ఇవ్వడం లేదని ఆమె వాపోయారు. నగరిలో టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల సమావేశానికి సంబంధించి అధికారులు తనకు సమాచారం ఇవ్వలేదని వాపోయారు.

 

కన్నీరు పెట్టిన ఎమ్మెల్యే రోజా