సభలో చొక్కా విప్పిన ఎమ్మెల్యే

165

కర్ణాటకలో అసెంబ్లీ సమావేశాలు రచ్చతోనే ప్రారంభమయ్యాయి. అధికార– ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం ఏర్పడింది. గురువారం అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన కొద్దీ సేపటికే ప్రతిపక్ష నేతలు అధికార బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. విధానసభలో ఒక దేశం– ఒక ఎన్నికపై చర్చించాలని సభాపతి విశ్వేశ్వరహెగడే కాగేరి సూచించారు దీనిపై కాంగ్రెస్‌ పక్ష నేత సిద్ధరామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా చర్చకు ఎలా పిలుస్తారని ప్రశ్నించారు. ఆర్టికల్‌ 363 ప్రకారం ఉన్న విశేషాధికారాలతో చర్చకు ఆహ్వానించినట్లు సభాపతి తెలిపారు.

ఈ నేపథ్యంలోనే విపక్ష సభ్యులు సభాపతి పోడియం చుట్టుముట్టారు. చర్చిస్తే తప్పేముందని బీజేపీ సభ్యులు వాదించారు. ఇరువర్గాల అరుపులతో గందరగోళం నెలకొంది. నిరసన తెలిపే సమయంలో భద్రావతి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంగమేశ్‌ సభాపతి పోడియం ముందుకు వచ్చి చొక్కా విప్పి నిరసన వ్యక్తం చేయడం కలకలం రేపింది. అసభ్యంగా ప్రవర్తించారని ఆయనను సభాపతి సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉంటే సెక్స్‌స్కాండల్‌లో ఇరుక్కుని మంత్రి పదవిని కోల్పోయిన రమేశ్‌ జార్కిహొళి సభకు గైర్హాజరయ్యారు.

సభలో చొక్కా విప్పిన ఎమ్మెల్యే