Mla Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్ కు రెండేళ్ల జైలు శిక్ష

545

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తు నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో అప్పట్లో రాజాసింగ్ పై కేసు నమోదైంది. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు రాజాసింగ్ కు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ రాజాసింగ్ హైకోర్టుకు వెళ్లనున్నట్లు సమాచారం.

2016 లో ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు విద్యార్థి నాయకులు క్యాంపస్ ఆవరణలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహించారు. అయితే ఈ సందర్బంగా రాజాసింగ్ వారిపై పలు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై నాంపల్లి కోర్టు ఈ రోజు విచారణ చేపట్టి శిక్ష ఖరారు చేసింది.

Mla Rajasingh : ఎమ్మెల్యే రాజాసింగ్ కు రెండేళ్ల జైలు శిక్ష