కరోనాతో ఎమ్మెల్యే మృతి

176

కేరళకు చెందిన సిపిఎం ఎమ్మెల్యేను కరోనా బలితీసుకుంది. కొంగడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే విజయదాస్ కరోనాతో మృతి చెందారు. కాగా ఈయనకు గతేడాది డిసెంబర్ 11 న కరోనా సోకింది. దింతో ఆసుపత్రిలో చేరాడు. ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కాగా 2016 ఎన్నికల్లో విజయదాస్ 13 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈయన మృతి తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందని కేరళ సీఎం పినరాయ్ విజయం తెలిపారు. విజయదాస్ మృతి పార్టీకి తీరని లోటని అభిప్రాయపడ్డారు సీఎం.

ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ప్రజల్లో కరోనా భయం బొత్తిగా పోయింది. సాధారణ రోజుల్లో ఎలా అయితే తిరుగుతారో ఇప్పుడు అదే విధంగా రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని చోట్ల మాస్కులు కూడా మరుస్తున్నారు. ఇక ప్రణయాలు కూడా సాఫీగా సాగుతున్నాయి. టెస్టుల కోసం ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. మరోవైపు దేశ వ్యాప్తంగా మొదటివిడత టీకా పంపిణి జరుగుతుంది. కరోనా వారియర్లకు టీకా ఇస్తున్నారు అధికారులు. రెండో దశలో పోలీసులకు టీకా ఇవ్వనున్నారు.

కరోనాతో ఎమ్మెల్యే మృతి