అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు జగన్: వైసీపీ ఎమ్మెల్యే

127

సభలు సమావేశాల్లో మాట్లాడుతున్నప్పుడు తడబడటం కామన్, పెద్ద పెద్ద నేతలే తప్పుగా మాట్లాడి నాలుక కరుచుకున్న సందర్భాలు కోకొల్లలు. ఇక ఈ నేపథ్యంలోనే సోమవారం ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకొని విజయనగరం జిల్లా, శృంగవరపుకోట నియోజకవర్గంలో జన్మదిన వేడుక నిర్వహించారు.. ఈ వేడుకకు ముఖ్యఅతిధిగా శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు వచ్చారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. నీతివంతమైన పాలనా అనే పదం వాడకుండా అవినీతి అనే పదం వాడారు. విచిత్రం ఏంటంటే ఈ మాట విని వేడుకకు వచ్చిన వారు చప్పట్లు కొడుతూ విజిల్స్ వేశారు. తడబడ్డారో.. పొరబడ్డారో.. లేక మనసులో మాట చెప్పారోగానీ అవినీతి పరిపాలన అనే మాట వైరల్ గా మారింది.

ఇదిలా ఉంటే భూసర్వే కార్యక్రమం ప్రారంభంలో సీఎం జగన్ కూడా తడబడ్డారు, భూసర్వే గురించి చెబుతున్న సమయంలో అక్షంశాలు, రేకాంశాలు అనే వ్యాఖ్యన్నీ జగన్ తప్పుగా ఉత్సరించారు. అక్షంశాలకు బదులు ఆకాంక్షలు అని ఉత్సరించారు. ఇక్కడ కూడా ప్రజలు చప్పట్లు కొట్టి విజిల్స్ వేశారు.

కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16000 మంది సర్వేయర్లతో భూ సర్వే నిర్వహిస్తుంది. మంగళవారం చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికోసం వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. రైతుల మధ్య భూ వివాదాలు లేకుండా చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

అవినీతి పరిపాలన అందించగల ఏకైక నాయకుడు సీఎం జగన్: వైసీపీ ఎమ్మెల్యే