అనారోగ్యంతో ఎమ్మెల్యే మృతి

141

అనారోగ్యంతో రాజస్థాన్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తావల్ కన్నుమూశారు. 48 ఏళ్ల శక్తావల్ గత కొంతకాలంగా లివర్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం ఆయన మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా శక్తావల్ కు భార్య ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే ఆయనకు కరోనా సోకినట్లుగా తెలుస్తుంది. ఈ విషయాన్నీ కుటుంబ సభ్యులు వెల్లడించారు. లివర్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న సమయంలోనే కరోనా సోకడంతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.

ఇక గతేడాది రాజస్థాన్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభ సమయంలో ఆయన రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ ఫైలట్ కు మద్దతుగా నిలిచారు. 2018 శాసనసభ ఎన్నికల్లో వల్లభనగర్‌లో పూర్వపు రాజకుటుంబానికి చెందిన రణధీర్ సింగ్ బిందర్‌ను గజేంద్రసింగ్‌ ఓడించారు. అంతకుముందు 2008లో అదే నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, ఆయన మృతి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్ దొతస్రా, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్ సంతాపం తెలిపారు.