ఎంజెఆర్ కళాశాల యజమాని ఆత్మహత్య

71

రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఎంజెఆర్ విద్యాసంస్థల అధినేత
చిత్తూరు జిల్లా కోడిదిపల్లె సమీపంలో ఘటన
కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు
డ్రైవర్ ను పక్కకు పంపి ఆత్మహత్య చేసుకున్న వెంకట రమణ రెడ్డి

ఎంజెఆర్ విద్యాసంస్థల అధినేత ఎం, వెంకట రమణారెడ్డి గురువారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం బొడుమల్లువారిపల్లె గ్రామానికి చెందిన మంచూరి వెంకట రమణ రెడ్డి, పీలేరు కల్లూరు రోడ్డులో ఎంజెఆర్ కళాశాలను నిర్వహిస్తున్నారు. గురువారం కాలేజీ పూర్తవగానే కారులోపులిచర్ల మండలం కోడిదిపల్లె పామీపంలోని రైల్వే గేట్ వద్దకు వెళ్లారు. కారు డ్రైవర్ ను తినేందుకు ఏమైనా తీసుకురమ్మని పంపి కారు దిగి పట్టాలపైకి వెళ్ళాడు వెంకటరమణ రెడ్డి..

అక్కడ ఉన్నవారు రైలు వస్తుందని అతడిని పక్కకి వెళ్లిపోవాలని వారించడంతో రైలు పట్టాల పక్కన నడుచుకుంటే పీలేరు వైపుకు వెళ్ళాడు.. కొద్దీ దూరం వెళ్ళగానే పట్టాలపైకి వచ్చాడు.. అంతలోనే తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్తున్న ప్యాసెంజర్ రైలు వేగంగా వచ్చి ఢీకొంది. రైలు సుమారు రెండు వందల మీటర్లవరకు వెంకట రమణరెడ్డిని ఈడ్చుకెళ్లింది. దింతో అతడి మృతదేహం భాగాలుగా విడిపోయింది. డ్రైవర్ స్థానికులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించారు. అయితే వెంకటరమణ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఎంజెఆర్ కళాశాల యజమాని ఆత్మహత్య