షూటింగ్ లో కుప్పకూలిన మిథున్ చక్రవర్తి

92

బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి షూటింగ్ జరుగుతుండగా కుప్పకూలిపోయారు. దింతో సెట్స్ లో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. కడుపు నొప్పి కారణంగా ఈ విధంగా జరిగిందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా “ది కశ్మీర్ ఫైల్స్” అనే చిత్రంలో చక్రవర్తి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ ముస్సోరీలో జరుగుతుంది. ఈ చిత్రానికి వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహిస్తున్నారు. 1990ల్లో కాశ్మీరీ హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించారు.

కాగా ఫుడ్ పాయిజనింగ్ వల్లనే మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది.. ఇక ఈ ఘటనపై దర్శకుడు వివేక్ మాట్లాడుతూ మిథున్ కొద్దీ సేపటికే కోలుకున్నారని తెలిపారు. 20 నిమిషాల్లో షూటింగ్ లో పాల్గొన్నారని అంత కమిట్మెంట్ ఉంది కాబట్టే ఆయన సూపర్ స్టార్ అయ్యారని అన్నారు. పలుమార్లు షూటింగ్ కి బ్రేక్ పడిన సమయంలో కూడా మిథున్ ఫోన్ చేసి తన వలన షూటింగ్ ఏమైనా వాయిదా పడిందా అని తెలుసుకునే వారని వివరించారు. ఇక చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని 2021 లో రిలీజ్ చేస్తామని వివేక్ తెలిపారు.

షూటింగ్ లో కుప్పకూలిన మిథున్ చక్రవర్తి