టీఆర్ఎస్ కు ఓటు వెయ్యని వారు బాగుపడరు – మంత్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

274

తెలంగాణలో మార్చి 14 న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. అధికార ప్రతిపక్ష పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ అదే విధంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల స్థానానికి ఎన్నిక జరుగుతుండగా అన్ని పార్టీల్లోని ప్రధాన నాయకులందరూ ఇక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి తరఫున మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది, తమ పార్టీ అభ్యర్థికి ఓటెయ్యని వారిని భగవంతుడు కూడా క్షమించడని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వాళ్లు బాగుపడరని.. వాళ్ల ఇండ్లు నాశనమై పోతాయని శాపనార్థాలు పెట్టారు. ఎవడైనా దుర్మార్గుడు కల్యాణలక్ష్మి తిని, రకరకాల కరెంట్ బిల్లులు, రైతు బీమా, వాళ్ల తల్లులకు పెన్షన్.. అన్నీ తిని.. ఇలాంటి పార్టీకి ద్రోహం చేస్తే భగవంతుడు కూడా క్షమించడు.. వాడు బాగుపడడు వాని ఇల్లు బాగుపడదు. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లిలోని చంద్రగార్డెన్ లో జరిగిన సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సమావేశం లక్ష్మారెడ్డి అధ్యక్షతన జరగ్గా.. ఈ సమావేశంలో శ్రీనివాగ్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై మండిపడుతున్నారు ప్రజలు.

టీఆర్ఎస్ కు ఓటు వెయ్యని వారు బాగుపడరు – మంత్రి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు