కార్గో పార్శిల్‌ హోం డెలివరీ ప్రారంభం

114

కార్గో పార్శిల్‌ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్‌ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్‌, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్‌ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్‌పల్లి, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు.