టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సీరియస్

248

ఖమ్మం జిల్లాపై మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఖమ్మం పట్టణంలో త్వరలో మునిసిపల్ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటంతో జిల్లాపై దృష్టిపెట్టారు కేటీఆర్. కాగా ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. గతంలోనే ఈ జిల్లాలో వర్గాలుగా విడిపోయారు. ఇక తాజాగా కూడా నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు.

ఎమ్మెల్యేలను క్లాస్ పీకారు. పార్టీలో ఎమ్మెల్యేల తీరు దురుసుగా వుందని, పాత కొత్త అందరినీ కలుపుకుని ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్యేలు వుంటారు పోతారని వ్యాఖ్యానించిన కేటీఆర్.. పార్టీ శాశ్వతమని క్యాడర్ ను కాపాడుకుంటూ ఉండాలని తెలిపారు. పార్టీలో నాయకులంతా సమన్వయంతో పని చేసుకోవాలని అన్నారు. పువ్వాడ అజయ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మంత్రి అని. కేవలం ఖమ్మంకు మాత్రమే మంత్రి అనుకోవద్దని కేటీఆర్ స్పష్టం చేశారు. నియాజకవర్గాల వారీగా అభివృద్ది పనులకు సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్‌కు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందజేశారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను గెలిపించి తీరాలని కోరారు మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్ సీరియస్